టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. అతడి సతీమణి రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను హిట్మ్యాన్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. తాము నలుగురమయ్యాం అంటూ సోషల్ మీడియాల్లో ఫ్యామిలీ అని రాసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈనెల 15న తమకు రెండో బిడ్డ జన్మించినట్లు పేర్కొన్నాడు.