VZM: బొబ్బిలి గ్రోత్ సెంటర్ను తహసీల్దార్ ఎం.శ్రీను శనివారం పరిశీలించారు. స్థానిక బెర్రీ పరిశ్రమ, విక్టోరీ పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై తహసీల్దార్ ఆరా తీశారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు భద్రత ప్రమాణాలు పాటించాలని, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని, నిబంధనలు పాటించని పరిశ్రమల యాజమాన్యాల పైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.