TG: మాజీమంత్రి మహేందర్ రెడ్డిపై తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు నరేందర్ రెడ్డికి అండగా నిలబడలేవా అంటూ ఆయనను నిలదీశారు. కొడుకు కోసం ఇంట్లో ఉన్న 90 ఏళ్ల మీ తల్లి.. నరేందర్ రెడ్డి భార్య, పిల్లల ఆవేదన నీకు కనిపించట్లేదా? అంటూ ప్రశ్నించారు. జిల్లాకు నేనే పెద్ద దిక్కునని చెప్పుకుని మహేందర్ రెడ్డి.. ఇప్పుడు లగచర్ల ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.