మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. ఇరుపార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు లేఖ రాసింది. తమపై వచ్చిన ఫిర్యాదులపై నవంబరు 18 మధ్యాహ్నం ఒంటిగంట నాటికి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.