బీజేపీ భయపడుతోందని, అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా షిర్డీలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని, కానీ ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహస్యం చేసింది ఎవరు? అని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఓటు హక్కుతో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని తెలిపారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు