కర్నూలు: ఆరోగ్యం పట్ల విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వెలుగోడులోని క్రాంతి దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను అలవర్చుకోవాలని తెలిపారు.