AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ విచారణ కొనసాగుతోంది. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు బోరుగడ్డ అనిల్‌ను విచారించనున్నారు. చంద్రబాబు, లోకేశ్ కుటుంబంపై అనిల్ అసభ్య పదజాలంతో దూషణలు చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం ఉద్దగిరి రాణి అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.