GDWL: సాంబార్లో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. వడ్డేపల్లి(M) పైపాడుకు చెందిన వీరేశ్ కూలీ పనులకు కర్నూలు జిల్లా గోనెగండ్ల (M) ఎనోడ్కు వెళ్లారు. ఆ ఊరిలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. వీరేశ్ కుమారుడు జగదీశ్ (6) ఫోన్‌తో ఆడుకుంటూ సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. ఈ క్రమంలో మూత జారిపోవడంతో సాంబారులో పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.