Pathan Vs Baahubali : ఇక ‘పఠాన్’ పనైపోయినట్టే.. ‘బాహుబలి-2’నే నెంబర్ వన్!
Pathan Vs Baahubali : బాహుబలి పేరు మీద ఎన్నో చెరిగిపోని రికార్డులున్నాయి. దాన్ని బద్దలు కొట్టాలంటే మళ్లీ రాజమౌళికే సాధ్యం. ఆర్ఆర్ఆర్తో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన జక్కన్న.. బాహుబలి ఫుల్ రన్ కలెక్షన్లను అందుకోలేకోయాడు. కానీ ట్రిపుల్ ఆర్ని ఆస్కార్ బరిలో నిలిపి.. చరిత్ర క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
బాహుబలి పేరు మీద ఎన్నో చెరిగిపోని రికార్డులున్నాయి. దాన్ని బద్దలు కొట్టాలంటే మళ్లీ రాజమౌళికే సాధ్యం. ఆర్ఆర్ఆర్తో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన జక్కన్న.. బాహుబలి ఫుల్ రన్ కలెక్షన్లను అందుకోలేకోయాడు. కానీ ట్రిపుల్ ఆర్ని ఆస్కార్ బరిలో నిలిపి.. చరిత్ర క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే మహేష్ బాబుతో గ్లోబల్ స్థాయిలో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. బాహుబలి రికార్డులన్నీ బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ పఠాన్ మూవీ మాత్రం.. కనీసం బాలీవుడ్ వరకైనా, బాహుబలి2 రికార్డ్‌ని బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి నానా తంటాలు పడుతోంది. నాలుగేళ్ల తర్వాత ‘పఠాన్’ మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చిన షారుఖ్.. అనుకున్నట్టే సాలిడ్ హిట్ అందుకున్నాడు. చాలాకాలం తర్వాత బాలీవుడ్‌కు పఠాన్ కాస్త ఊరటనిచ్చింది. వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసింది. అయితే బాహుబలి 2 హిందీ కలెక్షన్‌ను బీట్ చేసేందుకు గట్టిగా ట్రై చేస్తోంది పఠాన్. కానీ, ఆ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదనిపిస్తోంది. బాహుబలి-2 హిందీ వెర్షన్.. టోటల్ రన్లో 511 కోట్లు కొల్లగొట్టింది. ఈ టార్గెట్‌ను పఠాన్ రీచ్ అవాలంటే మరో నాలుగైదు కోట్లు రాబట్టాల్సి ఉంది. కానీ అది సాధ్యమయ్యేలా లేదని తెలుస్తోంది. బాహుబలి 2 రికార్డును అందుకోవాలంటే పఠాన్ రోజుకి కోటికి పైగా వసూలు చేయాల్సి ఉందట. కానీ కోటి లోపే వసూళ్లు అవుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘యాంట్ మేన్’ దెబ్బకు.. పఠాన్ కలెక్షన్స్ మరింతగా పడిపోయాయిని అంటున్నారు. దీంతో.. ఇక ‘పఠాన్’ పనైపోయినట్టే.. ఇంకొన్నాళ్లు బాహుబలి2నే హిందీలో నెంబర్ వన్ అంటున్నారు.