ముంబయి ధారావిలో రూ.లక్ష కోట్ల విలువైన భూమిని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని రాజ్యాంగాన్ని చదివినట్లయితే విద్వేషంతో సమాజాన్ని విభజించరన్నారు. రాజ్యాంగాన్ని తాము పరిరక్షించే ప్రయత్నం చేస్తుంటే.. బీజేపీ దాన్ని చెత్తబుట్టలో వేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలో కులగణన జరిగితేనే బలహీన వర్గాలు ఎలాంటి స్థాయిలో ఉన్నారో తెలుస్తుందన్నారు.