AP: సోషల్ మీడియాలో అసభ్యపోస్టులు పెట్టేవాళ్లను వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తమపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి పైనే తప్పుడు పోస్టులు పెట్టించారని దుయ్యబట్టారు. అలాంటి వాళ్లు రాష్ట్రంలో ఉండటానికే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కఠినంగా వ్యవహరిస్తామని.. చట్టానికి పదునుపెడతామని వెల్లడించారు.