VSP: మధురవాడ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన హర్షిత (16) నూతిలో పడి మృతి చెందింది. ఈ ఘటన గురువారం రాత్రి భీమిలి పరిధి బోయవీధిలోని గుడి సమీపంలో జరిగింది. స్థానికుల సమాచారంతో భీమిలి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హర్షిత ప్రేమను ఇంట్లో ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధరణలో తెలిందని వారు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.