భారత్‌తో ట్రంప్ సత్సంబంధాలు గతంలో లాగే కొనసాగుతాయని లీసా కర్టిస్ వెల్లడించారు. సుంకాలు, ఆయుధాల సరఫరా కోసం రష్యాపై ఆధారపడటం, ఇరాన్ నుంచి చమురు కొనడం వంటి విషయాల్లో గతంలో అనుసరించిన విధానాలే కొనసాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్‌లో ట్రంప్ ప్రసంగించినప్పుడు లక్ష మంది భారతీయులు హాజరైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తొలిసారి ట్రంప్ అధ్యక్షుడైన సమయంలో ఆయనకు డిప్యూటీ అసిస్టెంట్‌గా లీసా పనిచేశారు.