రంజీ ట్రోఫీలో హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. రోహ్తక్ వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో కాంబోజ్ 10 వికెట్లతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆటలో 2 వికెట్లు పడగొట్టిన అన్షుల్.. రెండో రోజు మిగితా 8 వికెట్లను నేలకూల్చాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా రికార్డులకెక్కాడు.