ALR: అరకు మండలం పెదలబుడు పంచాయతీ పీవీటీజీ కాలనీలో జాతీయ రహదారి నిర్మాణంలో తొలగించిన తన నివాస గృహానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని పొద్దు నీలంబర్ కోరారు. ఈమేరకు పాడేరు ఐటీడీఏలో శుక్రవారం సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ కు వినతిపత్రం అందజేశారు. సుమారు రూ.14లక్షలతో నిర్మించుకున్న నివాస గృహానికి కేవలం రూ.8లక్షలు మాత్రమే చెల్లించారని ఆవేదన చెందారు.