AP: వైసీపీ పాలనలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యమయ్యాయని మంత్రి డీబీవీ స్వామి విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.221 కోట్లతో కొత్తగా 65 హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వసతిగృహాల మరమ్మతులకు బడ్జెట్లో రూ.143 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. హాస్టళ్లలో ట్యూటర్స్గా స్థానిక యువతకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.