AP: ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఆలోచనతోనే మూడు పార్టీలు కలిసి పోటీ చేసినట్లు తెలిపారు. 93 శాతం స్టైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్రని చెప్పారు. మోదీ, పవన్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ప్రజల కోసం పనిచేయడం మనందరి బాధ్యతని అన్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు అనేక విధానాలు తీసుకువచ్చినట్లు తెలిపారు.