ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కశ్మీర్‌పై జరిగిన చర్చపై భారత విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఈ సభ విశ్వసిస్తోందంటూ ఇద్దరు సభ్యులు మాట్లాడటంతో వివాదం నెలకొంది. ‘ఆక్స్ఫర్డ్ యూనియన్ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుందని’ భారతీయ విద్యార్థులు ఆరోపించారు. కశ్మీర్‌పై మాట్లాడిన ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్, జఫార్ఖాన్లకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని విమర్శించారు.