TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని దోభిఘాట్ గ్రౌండ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. దోబీఘాట్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులగణన సర్వేలో బ్యాంకు ఖాతా వివరాలు అడగడం లేదన్నారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఆప్షన్ ఉంటుందని తెలిపారు. కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.