NTR: విజయవాడలోని అయ్యప్పనగర్ శాంతి రోడ్డులో ఏపీ అగ్ని వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యకమం శుక్రవారం జరిగింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్దె చెప్పారు. నూతన కార్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసుకున్న అగ్ని వన్నికుల క్షత్రియ సంఘీయులకు ఆయన అభినందనలు తెలిపారు.