ప్రకాశం: శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీలోని జువ్వలగుంట చెరువుకు శుక్రవారం గండిపడి నీరు రైల్వే ట్రాక్ దాటి వెళ్లిపోతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జువ్వలగుంట చెరువుకు అధికంగా వరద నీరు రావడంతో గండి పడింది. వరి పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న రైతులు గండిపట్టంతో ఆందోళనలకు గురవుతున్నారు.