AP: భూకబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనలో మదనపల్లెలో 13 వేల ఎకరాల్లో పేర్లు మార్చారని తెలిపారు. మదనపల్లె భూ అక్రమాల్లో ఎవరి హస్తం ఉన్నా.. వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.