కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ తెరుచుకుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి పంబ నుంచి స్వామివారి సన్నిధానం వరకు దేవస్థానం బోర్డు పాదయాత్రకు అనుమతిచ్చింది. ప్రతి రోజూ దర్శనం కోసం 30 వేల మందికి అనుమతిస్తున్నారు. శబరిమల గర్భాలయం వరకు సాయంత్రం 4 గంటలకు ప్రవేశం ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దర్శనానికి బుకింగ్ ఉండటంతో ఈ సీజన్లో దర్శన సమయాన్ని 18 గంటలకు వరకు పొడిగించారు.