AP: బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. హామీలకు నిధులు కేటాయించకుండా మోసం చేశారని ఆరోపించారు. విద్యా వ్యవస్థను ఐదు నెలల్లోనే చంద్రబాబు సర్వ నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.