ఎర్రటి అరటి పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్ ఏ, బీ, సీ, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, అనేక ఖనిజాలు ఉంటాయి. ప్రతి రోజూ ఈ పండు తినడం వల్ల గుండె, కిడ్నీలకు సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి.. రక్తపోటును నియంత్రిస్తుంది. సాధారణ అరటిపండ్లతో పోలిస్తే ఎర్రటి అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుందని వైద్యులు వెల్లడించారు.