మహారాష్ట్ర ఎన్నిక నేపథ్యంలో యూపీ సీఎం యోగి ప్రాచారంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘విడిపోతే చస్తారు’ అనే అర్థం వచ్చేలా నినాదం ఇచ్చారు. యోగి ఇచ్చిన నినాదాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. అంబేడ్కర్ సూత్రాలను పాటించే నేలపై అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అయితే అజిత్ చాలా కాలంపాటు సెక్యులర్, హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నారని మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు.