AP: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ తాజాగా విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. పవిత్రమైన విద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతించడంపై విద్యాశాఖ సీరియస్ అయినట్లు సమాచారం. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది.