AP: తన దగ్గర డబ్బుల్లేవు.. నూతన ఆలోచనలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘నూతన ఆలోచనలతో సంపద సృష్టిద్దాం. పేదలకు పంచుదాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. 64.50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తాం. ప్రజా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని చంద్రబాబు అన్నారు.