PPM: పాలకొండ నియోజకవర్గం సీపీఐ పార్టీ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు శుక్రవారం స్థానిక పార్టీ సభ్యులతో కలిసి పాలకొండ పట్టణంలో ఉన్న జగనన్న కాలనీ పరిశీలించారు. మౌలిక సదుపాయాలపై అసహనం వ్యక్తం చేశారు. పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలం హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న పాలకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు.