KNR: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. జిల్లాలోని 56 కేంద్రాల్లో 26,415 మంది పరీక్ష రాయనున్నారు. ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రశ్నాపత్రాలను ఉన్నతాధికారుల సమక్షంలో భద్రపరిచారు.