AP: ఈనెల 29న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. NTPC గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులను రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో చేపడుతున్నారు. ఇవి పూరైతే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.