మహారాష్ట్రలో ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్లో తనిఖీలు చేశారు. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను పలుమార్లు తనిఖీ చేయడంతో ఎన్నికల అధికారుల తీరుపై మాజీ సీఎం ఉద్ధవ్ విమర్శలు గుప్పించారు. సీఎం శిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మల్లికార్జున ఖర్గే బ్యాగులను కూడా అధికారులు తనిఖీ చేశారు. కాగా నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.