VSP: కోటవురట్ల మండలం సుంకపూరు గ్రామంలో రైతుల చేతుల్లో కొండచిలువ హతమైంది. గత కొద్దిరోజులుగా గ్రామంలో 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ కల్లాల వద్దకు వచ్చి తాము పెంచుకుంటున్న కోళ్లను మింగేస్తుందని రైతులు తెలిపారు. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. శుక్రవారం ఉదయం కొండచిలువను హతమార్చడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.