NLR: సోమశిల జలాశయానికి శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 7,684 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 69.287 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 50, ఉత్తర కాలువకు 550, కావలి కాలువకు 50, కండలేరుకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.