MLG: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ, మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తి గల మైనారిటీ యువతకు IELTS, GRE, TOEFL పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారని ములుగు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, సీహెచ్ రవీందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.