TG: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతుంది కాదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా కమీషన్ల కోసం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించింది. అందులో భాగమే ఈ ప్రజా ఉద్యమాలు, ప్రజల తిరుగుబాటు అని ఆ లేఖలో పేర్కొన్నారు.