TG: తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా వెళుతోందని సీఎం రేవంత్ అన్నారు. గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులను సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కులగణన సర్వే చేస్తున్నామని.. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలని చెప్పారు. గతంలో ఎప్పుడైనా సీఎం పిల్లలను కలిశారా.. మీ మధ్యలోకి వచ్చిన సీఎంను ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.