శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ముగియగానే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోగానే వాటిని లెక్కించడం కూడా ప్రారంభం అవుతోంది. వీటి ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. మొత్తం 225 సీట్లకు 196 సీట్లకు నేరుగా పోలింగ్ జరిగింది. మిగతా వాటికి నేషనల్ లిస్ట్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. వీటిలో 8821 మంది పోటీ పడ్డారు.