»Aussie Spinners Turn The Tables On India On Day 1
indore test:ఇండోర్ టెస్ట్‌లో ఫస్ట్ డే ఆసీస్ ఆధిపత్యం.. 47 రన్స్ లీడ్
indore test:ఇండోర్‌లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (border gavaskar trophy) మూడో టెస్ట్ ఫస్ట్ డే మ్యాచ్ ముగిసింది. తొలి రోజు ఆసీస్ (aussies) ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా (india).. 33.2 ఓవర్లకే కుప్పకూలిగింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆచి తూచి ఆడింది. ఫస్ట్ డే ముగిసేనాటికి 156 పరుగులు (156 runs) చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంకా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.
indore test:ఇండోర్‌లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (border gavaskar trophy) మూడో టెస్ట్ ఫస్ట్ డే మ్యాచ్ ముగిసింది. తొలి రోజు ఆసీస్ (aussies) ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా (india).. 33.2 ఓవర్లకే కుప్పకూలిగింది. టాప్ ఆర్డర్ (top order), మిడిల్ ఆర్డర్ (middle order) రాణించలేదు. దీంతో 109 పరుగులకు (109 runs) ఆలౌట్ (all out) అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆచి తూచి ఆడింది. ఫస్ట్ డే ముగిసేనాటికి 156 పరుగులు (156 runs) చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంకా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. టీమిండియా కన్నా 47 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.
చదవండి:virat kohli is twitter trending:ట్విట్టర్లో ట్రెండింగ్‌లో విరాట్ కోహ్లి.. ఎందుకంటే?
ఆసీస్ బౌలర్ మాథ్యూ కుహెన్మాన్ 5 వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచాడు. నాథన్ లైయన్ కూడా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ (aussuies) నిలకడగా ఆడింది. ఉస్మాన్ ఖవాజా 60 పరుగుల చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమైన మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ జట్టులోకి తిరిగి వచ్చారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. ఉప ఖండం పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. అందుకే స్టాండ్ ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (steve smith) స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. భారత్ జట్టు ప్లేయర్లు అంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు.