ప్రపంచంలోని చాలా దేశాల్లో వరిని పండిస్తారు. అయితే కిన్మెమై రైస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం. కిలో ధర రూ.15వేలు ఉంటుందట. జపాన్లో పండించే ఈ బియ్యం బ్రౌన్ రైస్ కంటే చాలా తేలికగా, చిన్నవిగా ఉంటాయి. తిన్న వెంటనే సులువుగా జీర్ణమవుతాయి. చాలా తక్కువ సమయంలో వీటిని వండుకోవచ్చు. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ బియ్యంలో 1.8 రెట్ల ఫైబర్, 7 రెట్లు విటమిన్ బి1 ఉంటుంది. అత్యంత ఖరీదైన బియ్యంగా కిన్మెమై గిన్నిస్ రికార్డు సాధించింది.