Anushka : బాహుబలి 2 తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసింది అనుష్క. చివరగా నిశ్శబ్దం సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత మొత్తంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసినంత పని చేసింది. కానీ ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
బాహుబలి 2 తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసింది అనుష్క. చివరగా నిశ్శబ్దం సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత మొత్తంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసినంత పని చేసింది. కానీ ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. పి.మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క కెరీర్లో ఇది 48వ సినిమా. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా.. జాతి రత్నాలు వంటి హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు అనగనగా ఒక రాజు అనే సినిమా కూడా చేస్తున్నాడు. అయితే అనుష్కతో చేస్తున్న సినిమా పై మంచి బజ్ ఉంది. కానీ ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే తాజాగా.. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఎనౌన్స్మెంట్ రేపు రాబోతుందంటూ.. నవీన్ పోలిశెట్టితో చిత్రీకరించిన ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క పోస్టర్‌తో నవీన్ మట్లాడుతూ.. టైటిల్స్ పెట్టే టైం వచ్చిందంటూ.. కొన్ని టైటిల్స్ చెప్పుకొచ్చాడు. దేవసేన నీ మనసులో ఉన్నది నేనేనా, స్వీటితో ఎవడీ క్యూటీ.. ఎలా ఉంటుందని చెప్పాడు. ఫైనల్‌గా అనుష్క పోస్టర్లో చేతిలో టార్చ్ లైట్ చూపిస్తు.. టైటిల్ క్లూ ఇస్తూ.. కమింగ్ గాయ్స్ అని ప్రకటించాడు. దాంతో ఈ సినిమా టైటిల్ ఏంటనే ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమాలో అనుష్క ‘అన్వితా రవళి శెట్టి’ అనే చెఫ్ పాత్రలో, నవీన్ పోలిశెట్టి ‘సిద్ధూ పొలిశెట్టి’ అనే స్టాండప్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా అనుష్క నుంచి ఓ కొత్త సినిమా వస్తుండడంతో.. స్వీటీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.