కోనసీమ: జిల్లాలో ఇసుక ర్యాంపుల నిర్వహణపై అధికారులతో అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ మహేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఇసుక టెండర్ల బిడ్లు ధ్రువీకరణ కమిటీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పలు విషయాలను సమీక్షించారు. జిల్లాలో 12 ఇసుక రాంపులలో వచ్చే ఏడాది మార్చి 14 వరకు ఇసుకను మాన్యువల్‌గా తీసి స్టాక్ పాయింట్లకు అందిస్తామని తెలిపారు.