Medico Preethi: ప్రీతి కేసులో తెరపైకి మరో కొత్త కారణం
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మెడికో ప్రీతి(Medico Preeti) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజిఎం(MGM) ఆస్పత్రిలో మెడిసిన్ చేస్తున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్(NIMS)లో ఆమెకు వైద్య చికిత్స అందించినా కోలుకోలేకపోయింది. తాజాగా ప్రీతి కేసు(Preeti Case)లో తెరపైకి మరో కొత్త కారణం బయటికొచ్చింది.
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మెడికో ప్రీతి(Medico Preeti) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజిఎం(MGM) ఆస్పత్రిలో మెడిసిన్ చేస్తున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్(NIMS)లో ఆమెకు వైద్య చికిత్స అందించినా కోలుకోలేకపోయింది. ప్రాణాలతో బయటపడుతుందనుకున్న బిడ్డ తణువుచాలించడంతో కుటుంబీకుల రోదనలు కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారు. రూ.30 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
వరంగల్ లో ప్రీతి(Preeti) పీజీ విద్యను అభ్యసిస్తోంది. ప్రీతిని సీనియర్ స్టూడెంట్ మహ్మద్ సైఫ్ వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రీతి(Preeti) స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం. ప్రీతి తండ్రి రైల్వే డిపార్ట్ మెంట్ లో ఏఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రీతి వారికి మూడో సంతానం.
సీనియర్ వేధింపులు భరించలేక ప్రీతి(Preeti) కేఎంసీలోని ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. తల్లిదండ్రులు మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ప్రీతి(Preeti) ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
తాజాగా ప్రీతి కేసు(Preeti Case)లో తెరపైకి మరో కొత్త కారణం బయటికొచ్చింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి రూ.50 లక్షల అడ్మిషన్ బాండ్ కూడా మరో కారణంగా తెలుస్తోంది. పీజీలో జాయిన్ అయ్యాక కాలేజీతో రూ.50 లక్షల బాండ్ ను కుదుర్చుకుంది. ఒక వేళ కాలేజీ మధ్యలో ఆగిపోతే వారికి రూ.50 లక్షల సొమ్మును చెల్లించాల్సి ఉంది. సీనియర్ వేధింపుల వల్ల కాలేజీ మానేయొచ్చు కదా అని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ తాను కాలేజీ మానేస్తే రూ.50 లక్షలు ఎలా చెల్లిస్తారనే బాధతో ప్రీతి(Preeti) మదనపడింది. వర్సిటీకి అంత డబ్బు తిరిగి చెల్లించడం కష్టం అని ఆలోచించి ప్రీతి(Preeti) కాలేజీ చదువును కొనసాగించింది. సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేక ప్రాణాలు వదిలింది.