Bandi Sanjay : ప్రీతిది ప్రభుత్వ హత్యే….. బండి సంజయ్ ఆరోపణ..!
Bandi Sanjay : మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి... వరంగల్ మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి లో శిక్షణ తీసుకుంటుండగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. ఆ వేధింపులకు తాళలేక ప్రీతీ ఆత్మహత్య కు పాల్పడింది. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వొదిలేసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి… వరంగల్ మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి లో శిక్షణ తీసుకుంటుండగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. ఆ వేధింపులకు తాళలేక ప్రీతీ ఆత్మహత్య కు పాల్పడింది. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వొదిలేసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెడికో ప్రీతి మృతిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేసారు. ఆమెది ప్రభుత్వ హత్య అని ఆయన ఆరోపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రీతిది ముమ్మాటికీ హత్యే అన్నారు. ప్రీతి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం పట్టించుకుంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. ముమ్మాటీకి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రీతి మరణించిందన్నారు.
కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించేంత వరకు తాము పోరాడతామన్నారు. భవిష్యత్తులో ప్రీతి లాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. ఇదే క్రమంలో ప్రీతి ఘటనపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు..? గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే స్పందించలేదా..?అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.