మహిళలకు సంబంధించి యూపీ మహిళా కమిషన్ పలు సూచనలు చేసింది. ‘మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదు. ఆడవాళ్ల శిరోజాలను కత్తిరించే పనులు కూడా చేయకూడదు. స్త్రీల దుస్తుల కొలతలు స్త్రీలు మాత్రమే తీసుకోవాలి. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి’ అని సూచించింది. ‘బ్యాడ్ టచ్’ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు.