ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి మరోసారి షాక్ తగిలింది. తెలంగాణ మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 14న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ 2027లో విడిపోతారంటూ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగస్టులో మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వగా.. వేణుస్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు స్టే ఎత్తివేయటంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.