TG: BRS, కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. BJPపై BRS, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తరని ఎద్దేవా చేశారు. CM మారుతారో లేదో తమకు తెలియదని.. కానీ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి BRSకు లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇంకా అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. KTR, రేవంత్‌వి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు.