ASR: పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ జోడూరులో పాఠశాల ఏర్పాటు చేసి.. టీచర్ను నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామంలో 28 మంది విద్యార్థుల ఉన్నారని.. వారు చదువుకోడానికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామానికి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చిన్నారులతో తల్లిదండ్రులు పాడేరు ఐటీడీఏ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు.