AP: లో ఓల్టేజ్ సమస్య వేధిస్తోందని సీఎం చంద్రబాబుకు ఆక్వా రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎం.. తక్షణం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సమస్య ఎక్కడ ఉందో నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు. రాష్ట్ర జీడీపీలో కీలకంగా ఉన్న ఆక్వా రంగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్‌తో పాటు ఆక్వాకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.