ATP: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఓ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు ఆ అనాధ శవానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్ మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం చికిత్స కొరకు వచ్చి ఆసుపత్రిలో మృతి చెందాడని తెలిపారు.